Jan 31, 2024
తెలంగాణ పరిశ్రమలు బిట్స్
• తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.
• అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ములుగు జిల్లాలో ఉన్నాయి.
• రాష్ట్రంలో మొత్తం మరమగ్గాల సంఖ్య 41,556.
• తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటోంది.
• దేశంలో మొదటి చక్కెర పరిశ్రమ 1903 లో ఏర్పడింది.
• తెలంగాణలో మొదటి చక్కెర పరిశ్రమను 1937 లో స్థాపించారు.
• తెలంగాణలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ.
• తెలంగాణలో పరిశ్రమల ద్వారా 56 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీని 1981 లో స్థాపించారు.
• సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఉంది.
• చక్కెర ఉత్పత్తిలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.
• అజంజాహీ మిల్లు 1934 లో స్థాపించారు.
• అజాంజాహీ మిల్లు వరంగల్ లో స్థాపించారు. 1990 లో అజాంజాహీ మిల్లు మూతపడింది.
• సంఘీ వస్త్ర పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
• పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ మేడ్చల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్ను 1980 లో స్థాపించారు.
• సూర్యలక్ష్మి కాటన్ మిల్లు ఆమన్ గల్ ప్రాంతంలో ఉంది.
• తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు బాలానగర్ లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ 1930 లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• చార్మినార్ సిగరెటన్ను వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ తయారు చేస్తోంది.
• నటరాజ్ స్పిన్నింగ్ మిల్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్ స్పిన్నింగ్ మిల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• పట్టు వస్త్ర పరిశ్రమకు గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాలు ప్రసిద్ధి.
• రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను 1938 లో ప్రారంభించారు.
• రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్.
• ఏపీ రేయాన్స్ లిమిటెడ్ వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.
• చార్మినార్ పేపర్ మిల్స్ మాతంగి ప్రాంతంలో ఉంది.
• నాగార్జున పేపర్ మిల్స్ పటాన్ చెరువు ప్రాంతంలో ఉంది.
• దేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1932 లో స్థాపించారు.
• కాగితాన్ని అధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది.
• జమ్మికుంటలో లెదర్ పార్క్ న్ను స్థాపించారు.
• దక్షిణాసియాలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను పాల్వంచలో స్థాపించారు.
• దేశంలో మొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను జంషెడ్పూర్ లో స్థాపించారు.
• తెలంగాణలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1958 లో స్థాపించారు.
• కేశోరామ్ సిమెంట్స్ పెద్దపల్లి జిల్లాలో ఉంది.
• రాశి సిమెంట్స్ నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో ఏర్పాటు చేశారు.
• దక్కన్ సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట హుజూర్నగర్ జిల్లాలో ఉంది.
• సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం జిల్లాలో ఉంది.
• హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ సనత్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• మహా సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట జిల్లాలో ఉంది.
• తోళ్ల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
• సూర్య వంశ స్పిన్నింగ్ మిల్ భువనగిరి జిల్లాలో ఉంది.
• నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (ప్లైవుడ్ పరిశ్రమ) పటాన్చెరువు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం టీఐఎస్ సీఓ.
• 1953 లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ స్థాపించారు.
• హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దేశంలో మొదటి సారిగా బెంగళూరు ప్రాంతంలో స్థాపించారు.
• హైదరాబాద్లోని హెచ్ఎంటీలో ఎలక్ట్రిక్ బల్బులు తయారు చేస్తారు.
• ప్రాగా టూల్స్ లిమిటెడ్ కవాడిగూడ ప్రాంతంలో ఉండేది.
• సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.
• దేశంలో మొదటి సిమెంట్ కంపెనీని 1904 లో స్థాపించారు.
• పింజోర్ హెచ్ఎంటీ ప్లాంట్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
• భోపాల్ ప్రాంతంలో మొదటి భారత్ హెవీ ఎల క్ట్రిక్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు.
Jan 30, 2024
Jan CA
1. భారత 75వ గణతంత్ర (రిపబ్లిక్ డే) వేడుకలు 2024, జనవరి 26న దిల్లీలో జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిల్లీలోని కర్తవ్యపద్లో 90 నిమి షాలపాటు ఈ వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరు కున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగించారు. ఈ రిపబ్లిక్ డే థీమ్ ను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించారు.
2. మాథ్యూ ఎబ్రైన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను గెలుచు కున్నాడు. 2024, జనవరి 27న మెల్బోర్న్ జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ సిమోన్ బొలెలి- ఆంద్రీ వవసోరి (ఇటలీ) జంట పై విజయం సాధించింది. దీంతో పురుషుల డబుల్స్ గ్రాండ్లమ్ టైటిల్ సొంతం చేసుకున్న మూడో భారతీయు డిగా బోపన్న నిలిచాడు.
3. పురుషుల డబుల్స్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన బోపన్నకు మొత్తంగా ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2017లో అతడు గాబ్రియెలా దబ్రో ఎస్కే (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.
4. అరినా సబలెంక..
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ కి చెందిన అరినా సబలెంక నిలిచింది. 2024, జనవరి 27న మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఆమె చైనాకు చెందిన కిన్వెన్ జెంగ్పై విజయం సాధించింది.
2023లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక రిబకినా పై గెలిచింది.
5. రానున్న లోక్సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేం దుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గణాంకాలు తెలిపాయి. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసు వారే.
6. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 'పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2020-23' పేరుతో అన్ని రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాల తీరును విశ్లేషిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23లో గరిష్ఠంగా కేరళలో పంచాయతీల సగటు ఆదాయం రూ.60.69 లక్షలుంటే తెలంగాణలో రూ.11.52 లక్షలుగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్ లో రూ.13.53 లక్షలు, బిహార్లో రూ.38.94 లక్షలుగా ఉంది.
Jobs
నోటిఫికేషన్‌లు
ప్రభుత్వ ఉద్యోగాలు
HCL, కోల్‌కతాలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), కోల్‌కతా వివిధ విభాగాలు/క్యాడర్‌లలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
పోస్టుల సంఖ్య: 40
విభాగాలు: మైనింగ్, జియాలజీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, సిస్టమ్.
అర్హత: బ్యాచిలర్‌లో 60 శాతం మార్కులు
డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. గేట్ పరీక్షలో అర్హత సాధించి, చెల్లుబాటు అయ్యే గేట్-2021/ గేట్-2022/ గేట్-2023 స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి (01/01/2024 నాటికి): 28 సంవత్సరాలు.
ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్/మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.500.
ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: 29/01/2024.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19/02/2024.
వెబ్‌సైట్: https://www.hindustancopper.com/
మరిన్ని నోటిఫికేషన్‌ల కోసం: QR కోడ్‌ని స్కాన్ చేయండి
కాపర్ లిమిటెడ్ హిందూస్తాన్
Subscribe to:
Comments (Atom)
Current affairs WhatsApp channel
Join current affairs WhatsApp Channel
-
Daily Edu