1. భారత 75వ గణతంత్ర (రిపబ్లిక్ డే) వేడుకలు 2024, జనవరి 26న దిల్లీలో జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిల్లీలోని కర్తవ్యపద్లో 90 నిమి షాలపాటు ఈ వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరు కున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగించారు. ఈ రిపబ్లిక్ డే థీమ్ ను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించారు.
2. మాథ్యూ ఎబ్రైన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను గెలుచు కున్నాడు. 2024, జనవరి 27న మెల్బోర్న్ జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ సిమోన్ బొలెలి- ఆంద్రీ వవసోరి (ఇటలీ) జంట పై విజయం సాధించింది. దీంతో పురుషుల డబుల్స్ గ్రాండ్లమ్ టైటిల్ సొంతం చేసుకున్న మూడో భారతీయు డిగా బోపన్న నిలిచాడు.
3. పురుషుల డబుల్స్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన బోపన్నకు మొత్తంగా ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2017లో అతడు గాబ్రియెలా దబ్రో ఎస్కే (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.
4. అరినా సబలెంక..
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ కి చెందిన అరినా సబలెంక నిలిచింది. 2024, జనవరి 27న మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఆమె చైనాకు చెందిన కిన్వెన్ జెంగ్పై విజయం సాధించింది.
2023లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక రిబకినా పై గెలిచింది.
5. రానున్న లోక్సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేం దుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గణాంకాలు తెలిపాయి. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసు వారే.
6. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 'పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2020-23' పేరుతో అన్ని రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాల తీరును విశ్లేషిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23లో గరిష్ఠంగా కేరళలో పంచాయతీల సగటు ఆదాయం రూ.60.69 లక్షలుంటే తెలంగాణలో రూ.11.52 లక్షలుగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్ లో రూ.13.53 లక్షలు, బిహార్లో రూ.38.94 లక్షలుగా ఉంది.
No comments:
Post a Comment