కరెంట్ అఫ్ఫైర్స్
◆ 'అంతర్జాతీయ పర్వత దినోత్సవం–2023'ను డిసెంబరు 11న ఏ థీమ్ తో నిర్వహించారు?
జ: 'రిస్టోరింగ్ మౌంటెయిన్ ఎకోసిస్టమ్స్' (పర్వత ఆవరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందాం.)
◆ యునైటెడ్ కింగ్డమ్కు చెందిన టెలిగ్రాఫ్ దినపత్రిక ఇటీవల కథనం ప్రకారం మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ దేశ గ్రామీణ యువ తను ఢిల్లీకి తీసుకొచ్చి వారికి డబ్బులు చెల్లించి, ధనవంతు లైన రోగుల కోసం కిడ్నీ మార్పిడ్లు చేయిస్తున్నారు? (ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్ఐటీటీఓ) దర్యాప్తునకు ఆదేశించింది.) జ: మయన్మార్
* జమ్ము-కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేతను సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు వెలు క వరించింది. ఈ ఘటనను స్వాగతిస్తూ కశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను మిళితం చేస్తూ 'బదలా కశ్మీర్' పేరిట ఎవరు రాసి, పాడిన ట్ పాటను భారత ప్రభుత్వం ఇన్స్టాలో షేర్ చేసింది? (ఈ 14 ఏళ్ల బాలిక ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్తో కలిసి పాడింది.)
జ: హుమైరా జాన్
5 * జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా జాడ తెలియని పిల్లల సంఖ్య ఎంత మొత్తంగా ఉంది?
(పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 2022లో పిల్లలు ఎక్కువగా అదృశ్యమైనట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. దేశీయంగా తప్పిపోతున్న ప్రతి వంద మంది చిన్నారుల్లో 63 మంది మాత్రమే తిరిగి అమ్మానాన్నల చెంతకు చేరుకోగలుగుతున్నారు. ఏమైపోయారో తెలియని పిల్లల్లో 71 శాతం బాలికలే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
No comments:
Post a Comment