Jan 31, 2024

తెలంగాణ సాగునీటి వ్యవస్థ బిట్స్

తెలంగాణ సాగునీటి వ్యవస్థ

బిట్ బ్యాంక్

• నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదటి చీఫ్ ఇంజినీర్ జాఫర్ అలీ.
• నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 1955, డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు.
• నాగార్జున సాగర్ నిర్మాణ సమయంలో కానూరి లక్ష్మణరావు ఇంజినీర్ గా పనిచేశారు.
• నందికొండ వద్ద నాగార్జున సాగర్ ప్రాజెక్టును నిర్మించారు.
• నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణ అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం ఖోస్లా కమిటీ ఏర్పాటు చేసింది.
• ప్రపంచంలోనే అతిపెద్ద, అతి ఎత్తయిన, అతి
• పొడవైన రాతి ఆనకట్ట నాగార్జునసాగర్.
• నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు మరో పేరు నందికొండ ప్రాజెక్టు.
• నాగార్జున సాగర్ నిర్మాణం 1967 లో పూర్తయింది.
• నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు.
• నాగార్జున సాగర్ డ్యాం పొడవు 15956 అడుగులు/ 4863 మీటర్లు.
• నాగార్జున సాగర్ డ్యాం ఎత్తు 150 మీటర్లు.
• తెలంగాణలో నాగార్జున సాగర్ కింద నల్ల గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలు ఆయకట్టు కలిగి ఉన్నాయి.
• నాగార్జున సాగర్ జల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 816 టీఎంసీలు.
• నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణానికి ముక్త్యాల రాజు ఆర్థిక సాయం చేశారు.
• నాగార్జున సాగర్ డ్యాం కృష్ణా నదిపై నిర్మిం చారు.
• నాగార్జున సాగర్ డ్యాం కుడి కాలువ పేరు జవహర్ కాలువ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ పేరు లాల్ బహదూర్ కాలువ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ పొడవు 296 కి.మీ.
• నాగార్జున సాగర్ కుడి కాలువ పొడవు 203 కి.మీ.
• నాగార్జున సాగర్ ఎడమ కాలువ వల్ల నల్ల గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలు లబ్ధి పొం దుతున్నాయి.
• భారతదేశంలో అతి పొడవైన డ్యాం హీరాకుడ్.
• తెలంగాణలో అతి పొడవైన డ్యాం నాగార్జున సాగర్.
• తెలంగాణలో అతి పెద్ద ప్రాజెక్ట్ నాగార్జున సాగర్.
• ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ కృష్ణా నదిపై నిర్మించారు.
• నాగార్జున సాగర్ అంతర్భాగంలో ఏర్పడినద్వీపం నాగార్జున కొండ.
• నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీరు సరఫరా చేస్తున్నారు.
• మూసీ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
• మూసీ ప్రాజెక్టు నిర్మాణం 1963లో పూర్తయిం ۵.
• దక్షిణ భారతదేశంలో అతిపెద్ద బహుళార్ధ సాధక ప్రాజెక్టు నాగార్జున సాగర్.
• ఆసియా ఖండంలోనే మొదటి భారీ తరహా ప్రాజెక్టు మెట్టూరు.
• కోయిల్ సాగర్ ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది.
• గట్టు ఎత్తిపోతల పథకం తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
• జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
• తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం గద్వాల జిల్లాలో ఉంది.
• రాజోలిబండ మళ్లింపు పథకం తుంగభద్ర నదిపై ఉంది.
• రాజీవ్ భీమ ఎత్తిపోతల పథకం నారాయణ పేట జిల్లాలో ఉంది.
• సరళాసాగర్ ప్రాజెక్టు వనపర్తి జిల్లాలో ఉంది.
• డిండి ప్రాజెక్ట్ నల్లగొండ జిల్లాలో ఉంది.
• పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
• నాగార్జునసాగర్ ప్రాజెక్టు నల్లగొండ జిల్లాలో ఉంది.
• శ్రీశైలం ప్రాజెక్టు కర్నూలు జిల్లాలో ఉంది.
• నార్లాపూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్ల గొండ జిల్లాలో ఉంది.
• స్వర్ణ ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• సత్నాల ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• నీళ్వాయి ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.
• మాతాది వాగు ప్రాజెక్ట్ ఆదిలాబాద్ జిల్లాలోఉంది.
• పోచారం ప్రాజెక్ట్ కామారెడ్డి జిల్లాలో ఉంది.
• సింగూరు ప్రాజెక్ట్ సంగారెడ్డి జిల్లాలో ఉంది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది.
• గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నాగర్ కర్నూల్లో ఉంది.
• గొట్టిముక్కల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నల్లగొండ జిల్లాలో ఉంది.
• అలీసాగర్ ప్రాజెక్టు ఉన్న జిల్లా నిజామాబాద్.
• గుత్ప ప్రాజెక్టును అరుగుల రాజారాం అనే పేరుతో కూడి పిలుస్తారు.
• ఖానాపూర్ ప్రాజెక్ట్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• చనకా - కోరాటా ప్రాజెక్టు ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• గడ్డెన్న - సుద్దవాగు ప్రాజెక్టు నిర్మల్ జిల్లాలో ఉంది.
• గుజ్జుల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
• తిప్పారం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సిద్దిపేట జిల్లాలో ఉంది.
• రాలివాగు ప్రాజెక్టు మంచిర్యాల జిల్లాలో ఉంది.

current affairs

31-01-2024

Groups practice bits

Groups important practice bits

తెలంగాణ పరిశ్రమలు బిట్స్



• తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పరిశ్రమలు మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి.
• అత్యల్ప పారిశ్రామిక యూనిట్లు ములుగు జిల్లాలో ఉన్నాయి.
• రాష్ట్రంలో మొత్తం మరమగ్గాల సంఖ్య 41,556.
• తెలంగాణ నుంచి వాణిజ్య వస్తువులను అత్యధికంగా అమెరికా దిగుమతి చేసుకుంటోంది.
• దేశంలో మొదటి చక్కెర పరిశ్రమ 1903 లో ఏర్పడింది.
• తెలంగాణలో మొదటి చక్కెర పరిశ్రమను 1937 లో స్థాపించారు.
• తెలంగాణలో మొదటి షుగర్ ఫ్యాక్టరీ నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ.
• తెలంగాణలో పరిశ్రమల ద్వారా 56 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.
• నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ శక్కర్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ముత్యంపేట షుగర్స్ ఫ్యాక్టరీని 1981 లో స్థాపించారు.
• సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ నిజామాబాద్ జిల్లాలో ఉంది.
• చక్కెర ఉత్పత్తిలో క్యూబా ప్రథమ స్థానంలో ఉంది.
• అజంజాహీ మిల్లు 1934 లో స్థాపించారు.
• అజాంజాహీ మిల్లు వరంగల్ లో స్థాపించారు. 1990 లో అజాంజాహీ మిల్లు మూతపడింది.
• సంఘీ వస్త్ర పరిశ్రమ రంగారెడ్డి జిల్లాలో ఉంది.
• పెంగ్విన్ వస్త్ర పరిశ్రమ మేడ్చల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్స్ సహకార స్పిన్నింగ్ మిల్ను 1980 లో స్థాపించారు.
• సూర్యలక్ష్మి కాటన్ మిల్లు ఆమన్ గల్ ప్రాంతంలో ఉంది.
• తెలంగాణ స్పిన్నింగ్ మిల్లు బాలానగర్ లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ 1930 లో స్థాపించారు.
• వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• చార్మినార్ సిగరెటన్ను వజీర్ సుల్తాన్ టోబాకో కంపెనీ తయారు చేస్తోంది.
• నటరాజ్ స్పిన్నింగ్ మిల్ నిర్మల్ జిల్లాలో ఉంది.
• గ్రోవర్ స్పిన్నింగ్ మిల్ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది.
• పట్టు వస్త్ర పరిశ్రమకు గద్వాల్, పోచంపల్లి, సిరిసిల్ల ప్రాంతాలు ప్రసిద్ధి.
• రాష్ట్రంలో తొలి కాగితం పరిశ్రమను 1938 లో ప్రారంభించారు.
• రాష్ట్రంలో అతిపెద్ద కాగితం పరిశ్రమ సిర్పూర్ పేపర్ మిల్స్.
• ఏపీ రేయాన్స్ లిమిటెడ్ వరంగల్ జిల్లాలోని కమలాపురంలో ఉంది.
• చార్మినార్ పేపర్ మిల్స్ మాతంగి ప్రాంతంలో ఉంది.
• నాగార్జున పేపర్ మిల్స్ పటాన్ చెరువు ప్రాంతంలో ఉంది.
• దేశంలో మొదటి కాగితం పరిశ్రమను 1932 లో స్థాపించారు.
• కాగితాన్ని అధికంగా మహారాష్ట్ర ఉత్పత్తి చేస్తోంది.
• జమ్మికుంటలో లెదర్ పార్క్ న్ను స్థాపించారు.
• దక్షిణాసియాలో మొదటి స్పాంజ్ ఐరన్ పరిశ్రమను పాల్వంచలో స్థాపించారు.
• దేశంలో మొదటి ఇనుము, ఉక్కు పరిశ్రమను జంషెడ్పూర్ లో స్థాపించారు.
• తెలంగాణలోని మొదటి సిమెంట్ ఫ్యాక్టరీని 1958 లో స్థాపించారు.
• కేశోరామ్ సిమెంట్స్ పెద్దపల్లి జిల్లాలో ఉంది.
• రాశి సిమెంట్స్ నల్లగొండ జిల్లాలోని వాడపల్లిలో ఏర్పాటు చేశారు.
• దక్కన్ సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట హుజూర్నగర్ జిల్లాలో ఉంది.
• సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కొత్తగూడెం జిల్లాలో ఉంది.
• హైదరాబాద్ ఆస్బెస్టాస్ పరిశ్రమ సనత్ నగర్ ప్రాంతంలో స్థాపించారు.
• ఇండియన్ హ్యూమ్ పైప్ ఫ్యాక్టరీ అజామాబాద్ ప్రాంతంలో ఉంది.
• మహా సిమెంట్స్ కంపెనీ సూర్యాపేట జిల్లాలో ఉంది.
• తోళ్ల ఉత్పత్తిలో తమిళనాడు రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది.
• సూర్య వంశ స్పిన్నింగ్ మిల్ భువనగిరి జిల్లాలో ఉంది.
• నోవోపాన్ ఇండియా లిమిటెడ్ (ప్లైవుడ్ పరిశ్రమ) పటాన్చెరువు ప్రాంతంలో ఉంది. ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ఇనుము - ఉక్కు కర్మాగారం టీఐఎస్ సీఓ.
• 1953 లో హిందుస్థాన్ మెషిన్ టూల్స్ స్థాపించారు.
• హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దేశంలో మొదటి సారిగా బెంగళూరు ప్రాంతంలో స్థాపించారు.
• హైదరాబాద్లోని హెచ్ఎంటీలో ఎలక్ట్రిక్ బల్బులు తయారు చేస్తారు.
• ప్రాగా టూల్స్ లిమిటెడ్ కవాడిగూడ ప్రాంతంలో ఉండేది.
• సిమెంట్ ఉత్పత్తిలో ప్రపంచంలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.
• దేశంలో మొదటి సిమెంట్ కంపెనీని 1904 లో స్థాపించారు.
• పింజోర్ హెచ్ఎంటీ ప్లాంట్లో ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారు.
• భోపాల్ ప్రాంతంలో మొదటి భారత్ హెవీ ఎల క్ట్రిక్స్ లిమిటెడ్ పరిశ్రమను స్థాపించారు.

Bits practice

గాంధి యుగం

Jan 30, 2024

Jan CA

1. భారత 75వ గణతంత్ర (రిపబ్లిక్ డే) వేడుకలు 2024, జనవరి 26న దిల్లీలో జరిగాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దిల్లీలోని కర్తవ్యపద్లో 90 నిమి షాలపాటు ఈ వేడుకలు జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరు కున్నారు. దాదాపు 40ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగించారు. ఈ రిపబ్లిక్ డే థీమ్ ను జాతీయ మహిళా శక్తితోపాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొన్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంకా సేవా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించారు.

2. మాథ్యూ ఎబ్రైన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్ను గెలుచు కున్నాడు. 2024, జనవరి 27న మెల్బోర్న్ జరిగిన ఫైనల్లో బోపన్న జోడీ సిమోన్ బొలెలి- ఆంద్రీ వవసోరి (ఇటలీ) జంట పై విజయం సాధించింది. దీంతో పురుషుల డబుల్స్ గ్రాండ్లమ్ టైటిల్ సొంతం చేసుకున్న మూడో భారతీయు డిగా బోపన్న నిలిచాడు.

3. పురుషుల డబుల్స్ తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన బోపన్నకు మొత్తంగా ఇది రెండో గ్రాండ్ స్లామ్ టైటిల్. 2017లో అతడు గాబ్రియెలా దబ్రో ఎస్కే (కెనడా)తో కలిసి ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డ్ డబుల్స్ టైటిల్ నెగ్గాడు.

4. అరినా సబలెంక..

ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా బెలారస్ కి చెందిన అరినా సబలెంక నిలిచింది. 2024, జనవరి 27న మెల్బోర్న్లో జరిగిన ఫైనల్లో ఆమె చైనాకు చెందిన కిన్వెన్ జెంగ్పై విజయం సాధించింది.
2023లో జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సబలెంక రిబకినా పై గెలిచింది.

5. రానున్న లోక్సభ ఎన్నికల్లో 96 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేం దుకు అర్హులని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) గణాంకాలు తెలిపాయి. వీరిలో మహిళలు 47 కోట్ల మంది ఉన్నారు. ఓటు వేసేందుకు అర్హులైన వారిలో 1.73 కోట్ల మంది 18-19 ఏళ్ల వయసు వారే.

6. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 'పంచాయతీరాజ్ సంస్థ ఆర్థిక పరిస్థితి 2020-23' పేరుతో అన్ని రాష్ట్రాల్లోని గ్రామ పంచాయతీల ఆదాయ, వ్యయాల తీరును విశ్లేషిస్తూ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2022-23లో గరిష్ఠంగా కేరళలో పంచాయతీల సగటు ఆదాయం రూ.60.69 లక్షలుంటే తెలంగాణలో రూ.11.52 లక్షలుగా ఉంది. వెనుకబడిన రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్ లో రూ.13.53 లక్షలు, బిహార్లో రూ.38.94 లక్షలుగా ఉంది.

Jobs

నోటిఫికేషన్‌లు

ప్రభుత్వ ఉద్యోగాలు

HCL, కోల్‌కతాలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL), కోల్‌కతా వివిధ విభాగాలు/క్యాడర్‌లలో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (GET) పోస్టుల నియామకం కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల సంఖ్య: 40

విభాగాలు: మైనింగ్, జియాలజీ, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మెకానికల్, సిస్టమ్.

అర్హత: బ్యాచిలర్‌లో 60 శాతం మార్కులు

డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. గేట్ పరీక్షలో అర్హత సాధించి, చెల్లుబాటు అయ్యే గేట్-2021/ గేట్-2022/ గేట్-2023 స్కోర్ కలిగి ఉండాలి.

వయోపరిమితి (01/01/2024 నాటికి): 28 సంవత్సరాలు.

ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్/మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.500.

ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ప్రారంభ తేదీ: 29/01/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19/02/2024.

వెబ్‌సైట్: https://www.hindustancopper.com/

మరిన్ని నోటిఫికేషన్‌ల కోసం: QR కోడ్‌ని స్కాన్ చేయండి

కాపర్ లిమిటెడ్ హిందూస్తాన్

Januaury current affairs

2024 Jan CA

Jan 10, 2024

కరెంట్ అఫ్ఫైర్స్

కరెంట్ అఫ్ఫైర్స్
◆ 'అంతర్జాతీయ పర్వత దినోత్సవం–2023'ను డిసెంబరు 11న ఏ థీమ్ తో నిర్వహించారు?

జ: 'రిస్టోరింగ్ మౌంటెయిన్ ఎకోసిస్టమ్స్' (పర్వత ఆవరణ వ్యవస్థను పునరుద్ధరించుకుందాం.)

◆ యునైటెడ్ కింగ్డమ్కు చెందిన టెలిగ్రాఫ్ దినపత్రిక ఇటీవల కథనం ప్రకారం మూత్రపిండాల అక్రమ మార్పిడి ముఠాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఏ దేశ గ్రామీణ యువ తను ఢిల్లీకి తీసుకొచ్చి వారికి డబ్బులు చెల్లించి, ధనవంతు లైన రోగుల కోసం కిడ్నీ మార్పిడ్లు చేయిస్తున్నారు? (ఈ వ్యవహారంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని జాతీయ అవయవ, కణజాల మార్పిడి సంస్థ (ఎన్ఐటీటీఓ) దర్యాప్తునకు ఆదేశించింది.) జ: మయన్మార్

* జమ్ము-కశ్మీర్లో ఆర్టికల్ 370 ఎత్తివేతను సమర్థిస్తూ 2023, డిసెంబరు 11న సుప్రీంకోర్టు తీర్పు వెలు క వరించింది. ఈ ఘటనను స్వాగతిస్తూ కశ్మీర్లో తాజా అభివృద్ధి పరిణామాలను మిళితం చేస్తూ 'బదలా కశ్మీర్' పేరిట ఎవరు రాసి, పాడిన ట్ పాటను భారత ప్రభుత్వం ఇన్స్టాలో షేర్ చేసింది? (ఈ 14 ఏళ్ల బాలిక ఈ పాటను ఎం.సి.రా అనే మరో ర్యాపర్తో కలిసి పాడింది.)

జ: హుమైరా జాన్

5 * జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) తాజా నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా జాడ తెలియని పిల్లల సంఖ్య ఎంత మొత్తంగా ఉంది?

(పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో 2022లో పిల్లలు ఎక్కువగా అదృశ్యమైనట్లు ఎన్సీఆర్బీ వెల్లడించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరుసగా ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచాయి. దేశీయంగా తప్పిపోతున్న ప్రతి వంద మంది చిన్నారుల్లో 63 మంది మాత్రమే తిరిగి అమ్మానాన్నల చెంతకు చేరుకోగలుగుతున్నారు. ఏమైపోయారో తెలియని పిల్లల్లో 71 శాతం బాలికలే అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

current affairs video

video

Current affairs WhatsApp channel

Join current affairs WhatsApp Channel